స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించడం వల్ల జిల్లాల వారీగా అందరికీ సమాన ఉద్యోగ, విద్యా అవకాశాలు దక్కుతాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించి అమల్లోకి తెచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పాత జోనల్ వ్యవస్థ రద్దు చేసి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో 7 జోన్లు , 2 మల్టీ జోన్లను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని అన్నారు.