ఇది అంకెల గారడి బడ్జెట్…
1 min read
నగర కాంగ్రెస్ అధ్యక్షులు… షేక్ జిలాని భాష
కర్నూలు, న్యూస్ నేడు : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి బడ్జెట్ అని కర్నూల్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కే జిలాని భాష ఎద్దేవ చేశారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 3.22 లక్షల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా అంకెల గారడి ప్రభుత్వమని, బడ్జెట్ ఓట్ల కోసం ప్రజలకు హామీలు ఇచ్చి అందలం ఎక్కి కూర్చున్నారని ఈరోజు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. ఇలాంటి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సబబు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ సమావేశంలో ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్ సి బజారన్న ఐఎన్టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, మహిళ కాంగ్రెస్ మాజీ చైర్మన్ ఎస్ ప్రమీల, మాజీ కోఆర్డినేషన్ చైర్మన్ అనంత రత్నం మాదిగ, ఈ లాజరస్, ఖాద్రి పాషా, రియాజుద్దీన్, బి సుబ్రహ్మణ్యం, ఆర్ ప్రతాప్, వసి భాష మొదలగువారు పాల్గొన్నారు.