NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర ప్రజలను విస్మరించిన కూటమి ప్రభుత్వం

1 min read

రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ :- సి అనిల్ కుమార్

కర్నూలు, న్యూస్​ నేడు:      కూటమి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను విస్మరిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ చిలక అనిల్ కుమార్ గారు విమర్శించారు. ఆదివారం రాత్రి  ప్రైవేట్ కార్యక్రమానికి కర్నూలు నగరానికి విచ్చేసిన ఆయన కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా అనిల్ కుమార్ కి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్ సి బజారన్న  సాదరంగా ఆహ్వానించి శాలువతో, పూలమాలతో సన్మానించారు. అనంతరం అనిల్ కుమార్  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చి నేడు వాటిని తుంగలో తొక్కారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళాశాల  విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15000, మొదలగు పథకాలను వెంటనే అమలు చేయాలని, దళితులకు బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోవని అదనంగా నిధులు దళితుల సంక్షేమానికి కేటాయించాలని, రంజాన్ నెల సందర్భంగా కుల మతాలకు అతీతంగా కార్డుదారులకు అందరికీ రంజాన్ తోఫా అందించాలని అనిల్ కుమార్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబిసి సెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, ఐఎన్ టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ నవీద్, బి సుబ్రహ్మణ్యం మొదలగువారు పాల్గొన్నారు.

About Author