ఉపాధి హామీ పనుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి..
1 min read
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్
పత్తికొండ, న్యూస్ నేడు: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేసిన 8 వారాలుగా చేసిన పనికి వేతనాల బకాయిలతో కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని వ్యవసాయ కారం సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ మండల కార్యదర్శి మహబూబ్ బాషా లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇన్చార్జ్ ఎంపీడీవో మరియు ఏపీవో లకు వినతిపత్రం పత్రం అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, దాదాపుగా రెండు నెలలుగా చేసిన పనికి వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతక బతకాలని, ప్రభుత్వము మరియు అధికారులు కూలీలకు వేతనాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇట్లాంటి చర్యలు ద్వారా ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. పెండింగ్ వేతనాలు పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా రాజకీయాలకతీతంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వహించాలని వారు కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించకుంటే ఉపాధి హామీ కూలీలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ బాషా బజారి గాజుల శ్రీనివాసులు లక్ష్మిరెడ్డి సిఐటియు మండల కార్యదర్శి అశోక్ ,సుధాకర్, రవీంద్ర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.