చిలకలడోన అంగన్వాడి -1 టీచర్ పై విచారణ జరిపి సస్పెండ్ చేయాలి
1 min read
ఆదోని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఏబీవీపీ నాయకులు మారుతి
ఆదోని, న్యూస్ నేడు : మండల పరిధిలోని చిలకలడోన గ్రామం లో ఉన్న అంగన్వాడీ -1 సెంటర్లో విధులు నిర్వహిస్తున్న టీచర్ సుందరమ్మ పై విచారణ జరిపించి విధుల నుండి సస్పెండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆదోని లో సబ్ కలెక్టర్ కి సోమవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మారుతి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ పాటించకుండా, ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలోకి తొక్కడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెనూ పాటించాలని పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించి వారికి బాల్యంలోనే మంచి నడవడికలు నేర్పించాల్సిన అంగన్వాడీ టీచర్ సుందరమ్మ ప్రభుత్వ ఆకాంక్షలకు విరుద్ధంగా చిలకలడోన గ్రామం అంగన్వాడి 1 సెంటర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి టీచర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మరియు కోడిగుడ్లను అందించక పోవడం దారుణమని అన్నారు. ఇష్టారాజ్యంగా ఆమె వ్యవహరిస్తూ తనకు నచ్చినట్లుగా విద్యార్థులకు వంట వండించడం జరుగుతుందని అంగన్వాడి మీటింగ్ పేరుతో ఎలాంటి మూమెంట్ లెటర్ లేకపోయినా తమకు నచ్చినట్టుగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. బాలింతలకు, చిన్న పిల్లలకు మంచి అలవాట్లు క్రమశిక్షణ నేర్పించాల్సినటువంటి టీచర్లే చిన్న పిల్లల పట్ల ఇలా చేయడం దారుణమని అన్నారు. చిన్నపిల్లలు అందరూ హాజరు కాకపోయినా, హాజరు అయినట్టు వేసుకొని దుర్వినియోగం చేస్తూ ప్రతిరోజూ పదిమంది పిల్లలు అంగన్వాడీ సెంటరకు వస్తే ముప్పై మంది పిల్లలు వచ్చినట్లు రికార్డులలో చూపిస్తున్నారని అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున సంబంధిత అధికారులు ఆమెపై విచారణ జరిపి విధుల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.