“వినికిడి లోపానికి కారణాలు – అవగాహన
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: “వినికిడి లోపానికి కారణాలు – అవగాహనా ” ఈరోజు “చెవుడు కారణాలు – నివారణ మార్గాలు ” అవగాహనా కార్యక్రమం పురస్కరించుకొని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్. వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ ర్యాలీ కార్యక్రమం లో డాక్టర్ వెంకటరమణ సార్ గారు మాట్లాడుచు, పిల్లలలో, పెద్ద వాళ్లలో సాధారణంగా వచ్చే వినికిడి సమస్యలకు ప్రధాన కారణం – పుట్టుకతో చెవి మూసుకుపోవడం, వినికిడి సమస్యతో పుట్టడం, చెవిలో గులిమి పేరుకుపోవడం, చెవి లోపల కర్ణబేరి చిల్లు పడటం, చెవిలో ధీర్ఘ కాలంగా చీము కారడం, శబ్ద కాలుష్యం, ప్రమాదాలలో తలకు గాయాలు అవ్వడం, చెవి నుండి రక్తం కారడం, వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా చెవి నొప్పికి, చీము కారడానికి సంబంధం కాని చెవి మందులు వాడటం, వయసు పెరిగేకొద్దీ వినికిడి లోపం రావడం, పిల్లలు, పెద్దలు చెవులలో ఇబ్బంది అనిపించినప్పుడు బలపాలు, పెన్నులు, పెన్సిల్స్, పిన్నుసులు పెట్టుకొని తిప్పడం వలన చెవి లోని కర్ణభేరి చిరిగి రంధ్రం కావడం వలన చెవుడు వచ్చే ప్రమాదం ఉంటుందని, చెవులకు సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా సంబంధిత చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులను సంప్రదించి, వారి సలహాలు, సూచనల మేరకు చికిత్సలు పొంది, మందులు వాడాలని, సొంత వైద్యం, నాటు వైద్య పద్ధతులు పాటించరాదని, ఈ విషయాలపై క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహనా కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి Dr. వెంకటరమణ అన్నారు. ఈ ర్యాలీ లో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కాంతారావు నాయక్, ఎన్. హెచ్. ఎమ్. జిల్లా అధికారి డాక్టర్ అంకిరెడ్డి, ఎమ్. సి. హెచ్. అధికారి ప్రసన్న లక్ష్మి, డెమో రవీంద్ర నాయక్, స్టాటిష్టికల్ అధికారి సుజాత, పారామెడికల్ సిబ్బంది గురప్ప, శివరాం, జగదీష్, హరినాథ్ రెడ్డి, మస్తానయ్య, డైస్ సిబ్బంది పాల్గొన్నారు.