అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి…
1 min read
మంత్రాలయం , న్యూస్ నేడు: మంత్రాలయం మండలంలో అర్హులైన నిరుపేదల అందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి హెచ్ జయరాజు, బి అనిల్ డిమాండ్ చేశారు. సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్న వాళ్లందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రాలయం లో చాలామంది పేదలు ఇంటి స్థలాలు లేక ఇల్లు లేక అద్దె ఇండ్లలో జీవనం గడుపుతూ కొనసాగిస్తున్నారు తెలిపారు. అలాంటి పేదలని గుర్తించి ఇంటి స్థలాలు కేటాయించాలని కూటమి ప్రభుత్వానికి సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రవి కి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టి లక్ష్మన్న, దేవిపుత్ర, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.