ఆదోని ప్రజల కోసం… మా పోరాటం..
1 min readరోడ్లు వేయండని అడిగితే…దాడులా…?
- పదైదేళ్లు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిఅరాచకం..
- వైసీపీకి ఓటు వేయొద్దు….
- కమలం గుర్తుకు ఓటు వేయండి….
- నన్ను ఆశీర్వదించండి… అభివృద్ధి చేసి చూపిస్తా…
- ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
ఆదోని, పల్లెవెలుగు: ఆదోని అభివృద్ధి పట్టించుకోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి… బెదిరింపులు…దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కాలం గడుపుతున్నాడని, ఇటవంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇచ్చి… బానిస బతుకులు బతుకుతారా… అని పట్టణ ప్రజలను ప్రశ్నించారు ఆదోని కూటమి (బీజేపీ–జనసేన–టీడీపీ) అభ్యర్థి డా. పార్థసారధి. గురువారం పట్టణంలోని ఎన్టీ ఆర్ నగర్, టీజీఎల్ కాలనీ, కుమ్మరిగేరి, గణేష్ సర్కిల్ లో కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు పంపితే… వెచ్చించి… అభివృద్ధి చేయకుండా .. నిధులను వెనక్కి పంపాడని, మిమ్నల్ని ఇలాగే అణిచి వేస్తున్నాడని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు వేయరు… రోడ్ల విస్తరణ పట్టించుకోరు… తాగునీరు..వీధిలైట్లు… ఇలా కనీస వసతులు కూడా ఎందుకు కల్పించలేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్లు బాగా లేవని చెప్పిన ఓ యువకుడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేశాడని, ఎవరు నోరెత్తకుండా దాడులు… అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. భూ కబ్జా, రేషన్, ఇసుక, మద్యం, మట్కా మాఫియాను పెంచి పోషిస్తూ.. కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని … ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి… ఆశీర్వదిస్తే ఆదోనిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నాది… అని పట్టణ ప్రజలకు కూటమి అభ్యర్థి డా. పార్థసారధి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ మల్లప్ప, టీడీపీ , బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.