ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్ టాక్స్ సరైన పద్దుకు జమచేయండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం నుండి మినహాయింపయ్యే సర్వీస్ టాక్స్ సరైన పద్దు క్రింద జమయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈఎస్ఐ (సర్వీస్ టాక్స్) మినహాయింపు పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతం నుండి ప్రతి నెల సర్వీస్ టాక్స్ చెలిస్తున్నారా లేదా ? ఒకవేళ మినహాయింపు అయ్యే ఈఎస్ఐ సర్వీసు టాక్స్ ఏ పద్దు క్రింద జమ అవుతుందనే అంశాలపై జిల్లా అధికారులకు అవగాహన ఉండాలన్నారు. సర్వీసు టాక్స్ చెల్లించడం ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్స పొందే అవకాశం ఉంటుందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. వచ్చే సోమవారం అన్ని శాఖల్లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలతో హాజరు కావడంతోపాటు సర్వీసు టాక్స్ ఏ పద్దు క్రింద జమ అవుతుందనే విషయాలపై సమీక్షిస్తానని కలెక్టర్ తెలిపారు.అనంతరం ఈఎస్ఐ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి వారిని ఈఎస్ఐలో నమోదయ్యే విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ రామునాయక్, ఈఎస్ఐ కార్పొరేషన్ బ్రాంచ్ మేనేజర్ దుర్గ ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.