వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ
1 min read
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూడు చక్రాల సైకిళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వికలాంగ లబ్ధిదారులకు వీల్ చైర్ లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో భాగంగా వికలాంగులకు వీల్ చైర్లు, దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లను కలెక్టర్ పంపిణీ చేసారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో వీల్ చైర్ కావాలని దరఖాస్తు చేసుకున్న ఐదు మంది వికలాంగుల లబ్ధిదారులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో వీల్ చైర్ 8000 రూపాయల విలువగల 5 వీల్ చైర్లను ఐదు మంది వికలాంగ లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. అలాగే ఆరు మంది దివ్యాంగ విద్యార్థులకు 30 వేల రూపాయల విలువ చేసే ల్యాప్ ట్యాప్ లను పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇకనుండి వీల్ చైర్స్ కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వీల్ చైర్ లను ఇంటి వద్దనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వికలాంగుల సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బాల్య వివాహాల నిర్మూలన కోసం సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతోందని… ఈ మేరకు అన్ని మండలాలలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కృషి చేస్తానని జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. పిజిఆర్ఎస్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు సంతకాలు చేసారు.