సమయపాలన పాటించని అంగన్వాడి-2టీచర్ సుజాత పై చర్యలు తీసుకోవాలి
1 min readపీ ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : నందవరం మండల పరిధిలోని పూలచింత గ్రామంలోని అంగన్వాడి-2 టీచర్ సుజాత ఆయా నాగమ్మ సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిండ మనుషులు మరియు బాలింతలు ప్రజలు తెలియజేయడం వలన వారిపై చర్యలు తీసుకోవాలని పీ ఎస్ యు జిల్లా కార్యదర్శి శుక్రవారం డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగన్వాడి కేంద్రం వ్యవస్థ లో ఉద్యోగ టీచర్స్, ఆయా నియమించి ప్రజలకు గర్భిణీ స్త్రీలకు పిల్లలకు సేవ చేయాలన్న దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం జరిగింది. కానీ పూలచింత గ్రామంలో టీచర్ సుజాత ఆయా మరియమ్మ అంగన్వాడి సెంటర్లో వుండకుండా ఇష్ట రాజ్యాంగ వస్తుపోతు నిబంధనలకు విరద్ధంగా గర్భిణీ స్త్రీల సైతం వారిని ఫేషియల్ యాప్ కోసం ఇంటికి రప్పించుకుని వేయించుకుంటూ సెంటర్లో అందుబాటులో లేకుండా విధులు తన ఇష్టానుసారంగ ప్రభుత్వ విధులకు డుమ్మా కొట్టి ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఫేషియల్ యాప్ హాజరు పెట్టినా కూడా అధికార విధులకు తుంగలో తొక్కి తూట్లు పొడుస్తున్న ఇలాంటి వారిపై ఎమ్మిగనూరు ఐసీడీఎస్ cdpo మేడమ్ వారు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్పందించ ఎడల ప్రజలతో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని అన్నారు.