ఎన్నికల్లో ఓడిపోతానని జగన్ కి అర్థమైంది..
1 min readకర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు
కోడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి తో కలిసి మామిదల పాడు, మెను దొడ్డి, పులకుర్తి గ్రామాల్లో జోరుగా ప్రచారాలు
ఎన్నికల్లో ఓడిపోతానని జగన్ కి అర్థమైంది, తట్ఠా, బుట్ట సర్దుకుంటున్నాడు
లండన్ వెళ్లేందుకు సి.బి.ఐ కోర్టును జగన్ అనుమతి కోరాడు
జగన్ ఇంక లండన్ కే పరిమితమవుతాడు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు పెట్టి సమస్యలు పరిష్కరిస్తాం
ఫ్యాన్ కి ఓటు వేస్తే మన ఆస్తులు కోల్పోయి ఈ ఫ్యాన్ కే ఉరి వేసుకోవాలి
తెలుగుదేశం ప్రభుత్వం లోనే ప్రజల ఆస్తులు సురక్షితంగా ఉంటాయి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్నికల్లో ఓడిపోతానని జగన్ కి అర్థమైందని , అందుకే తట్ఠా , బుట్ట సర్దుకుంటున్నాడని కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని మామిదలపాడు, మెను దొడ్డి , పులకుర్తి గ్రామాల్లో కోడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొగ్గుల దస్తగిరితో కలిసి నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ పోలింగ్ తర్వాత లండన్ వెళ్లేందుకు సి.బి.ఐ కోర్టు ను జగన్ అనుమతి కోరాడని , ఎన్నికల తరువాత ఇక ఆయన లండన్ కే పరిమితమవుతారన్నారు.. ల్యాండ్ యాక్ట్ పేరు ప్రజల ఆస్తులను కాజేసేందుకు జగన్ పన్నాగం పన్నాడని, పొరపాటున ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే మన ఆస్తులను కోల్పోయి ఆ ఫ్యాన్ కే ఉరి వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.. మన ఆస్తులు మన దగ్గరే సురక్షితంగా ఉండాలన్న , రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.. ఇక వైసీపీ అవినీతి పాలనలో కర్నూలు జిల్లాలోని గ్రామాలు కనీస మౌలిక సదుపాయాల కు నోచుకోక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి, తాను ఎం.పి గా గెలిచిన తరవాత గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.