సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం.. ఎవరికి చేస్తారు ?
1 min read
పల్లెవెలుగు వెబ్: సొంత చెల్లెలికి న్యాయం చేయలేని సీఎం జగన్ మోహన్ రెడ్డి .. రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తారని తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. మహిళలను కాపాడలేని సీఎం తక్షణం పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలను కాపాడలేని సీఎం రాష్ట్రానికి అవసరమా ? అని వ్యాఖ్యానించారు. అసమర్థ సీఎం పాలనలో పోలీసుల కూడ పాలన మరిచార ? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి కేసుల గురించి మాట్లాడటం తప్పా.. ఆడబిడ్డల రక్షణకు అవసరమైన చట్టాల గురించి మాట్లాడరా అని అన్నారు. దిశ యాప్ పేరుతో హడావుడి చేయడం తప్పా… చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.