ఘనంగా భారత్ పెట్రోలియం వారి ఎస్ఎస్ ఎన్ ఫుల్లీస్ ప్రారంభోత్సవం
1 min read
ప్రారంభించిన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి
పాల్గొన్న కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,వివిధ పెట్రోల్ బంకుల యజమానులు,మిత్రులు శ్రేయోభిలాషులు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు తంగెళ్ళమూడి జంగారెడ్డి గూడెం రోడ్డు లో సంకాబత్తుల వెంకట రమేష్,దీపక్ స్థాపించినటువంటి భారత్ పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని ప్రారంభోత్సవం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధా కృష్ణయ్య (చంటి) ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఆఫీస్ సముదాయాన్ని ప్రారంభించారు.మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ మరియు స్థానిక డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చలమోలు రాము,పొలిమేర హరికృష్ణ,భారత్ పెట్రోల్ బంక్ అధికారులు మరియు,ఏలూరులో ఉన్న పురప్రముఖులు, వ్యాపారవేత్తలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు వివిధ పెట్రోల్ బంకుల యజమానులు పాల్గొని వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.