గూల్యం గాదిలింగేశ్వర స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్న చిప్పగిరి లక్ష్మీనారాయణ..
1 min read
ఆలూరు , న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హలహర్వి మండలం గూల్యం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ గాదిలింగేశ్వర స్వామి వారి జోడు రథోత్సవం సంధర్భంగా స్వామి వారిని దర్శించుకున్న ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వర్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ హలహర్వి మండల ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ ఆహ్వానం మేరకు గూల్యం గాదిలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాదిలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని దేవున్ని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్ ఉపాధ్యక్షులు కరెంటు గోవిందు, మల్లికార్జున, బాపురం మోషే, ఎమ్మార్పీఎస్ నాయకులు కత్తి రామాంజనేయులు, బాపురం వీరేష్ లింగంపల్లి రామాంజనేయులు, మీసాల గోవిందు, వరకుమార్ మరియు నవీన్ పాల్గొన్నారు.
