క్రీడాభివృద్ధికి కృషి …మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: కర్నూలు నగరంలో క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తూ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ క్రీడలతో శారీరిక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా ఉంటుందని అన్నారు. బంగారు పేటకు చెందిన నీలి షికారులు నిర్వహిస్తున్న బిపిసిఎల్ పోటీలకు స్థానికులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు కర్నూలుకు వచ్చి ఆడడం అభినందించదగ్గ విషయం అన్నారు. ఎవరితో సహకారం తీసుకోకుండా ఎంతో క్రమశిక్షణతో నాలుగు సంవత్సరాలుగా ఈ పోటీ నిర్వహిస్తుండడం చిన్న విషయం కాదన్నారు. టీజీ భరత్ ప్రీమియర్ లీగ్ పేరుతో కర్నూల్ నగరంలో ఇలాగే తాము కూడా పోటీలు నిర్వహించి యువతకు ప్రోత్సాహకాన్ని అందిస్తామని టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని ఒక్కో వార్డుకు ఒక్కో జట్టుగా తయారుచేసి క్రీడల నిర్వహణకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విటల్ శెట్టి, బంగారు పేట ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్లు సురేష్ , శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.