మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
1 min read
రాష్ర్ట మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యా రాణి
కర్నూలు , న్యూస్ నేడు: మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని రాష్ర్ట మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యా రాణి జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.మార్చి 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం రాష్ర్ట మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యా రాణి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు,భద్రతా, రక్షణ, గౌరవం తెలియ చేస్తూ అన్ని శాఖల సమన్వయంతో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు..ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారుమహిళా సాధికారతను చాటేలా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించాలిజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషామహిళా సాధికారతను చాటేలా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మహిళా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.. డి ఆర్ డి ఎ, మెప్మా శాఖలు కీలక పాత్ర పోషించాలన్నారు..మహిళా సంఘాల్లో విజయవంతంగా వ్యాపారాలు చేస్తున్న వారిని, పారిశ్రామిక వేత్తలు తదితరులను ఈ వేడుకలకు ఆహ్వానించాలన్నారు.. ఆయా రంగాల్లో విజయాలు సాధించిన మహిళలను ఆహ్వానించి సన్మానం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద బ్యాంకు రుణాల మంజూరు,బ్యాంక్ లింకేజి, ఇతర ఆర్థిక సహాయాలు మహిళా లబ్దిదారులకు మెగా చెక్ లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. అలాగే నైపుణ్యాభివృద్ధి లో భాగంగా శిక్షణ పొందుతున్న వారిని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు..జీవనోపాధిని పెంచే రాపిడో ఎలక్ట్రిక్ బైక్స్ వంటి ఆస్తుల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఒక సెంటర్ ను గుర్తించాలని కలెక్టర్ బీసీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు..అలాగే ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ ల ద్వారా ఆర్థిక సహాయం, శిక్షణ కు సంబంధించిన మహిళా లబ్ధిదారులకు మెగా చెక్ లు, ఇతర సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ఆయా శాఖలకు సంబంధించిన స్టాళ్లను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఆహ్వానాలు పంపాలని కలెక్టర్ డిఆర్వో, ఐసిడిఎస్ పిడి లను ఆదేశించారు.సుమారు మూడు వేల మంది మహిళలు పాల్గొనేలా సమావేశపు వేదికను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.. ప్రకాశం జిల్లాలో నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని, ముఖ్యమంత్రి సందేశం, లైవ్ కార్యక్రమాన్ని వీక్షించేలా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..సమావేశం లో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా , డిఆర్ఓ వెంకటనారాయణమ్మ , ఐసిడిఎస్ పిడి నిర్మల , మెప్మా పీడీ నాగ శివ లీల, డిఆర్డిఏ పిడి రమణారెడ్డి, ఎల్ డి ఎం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
