నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులు త్వరగా పూర్తిచేయండి…
1 min read
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ క్రిటికల్ కేర్ బ్లాక్ పనుల తనిఖీ
కర్నూలు, న్యూస్ నేడు: ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో నిర్మాణ దశలో ఉన్న ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా క్రిటికల్ కేర్ బ్లాక్ పనులను పరిశీలించేందుకు ఆయా విభాగపు హెచ్ఓడిలతో కలిసి జనరల్ సర్జరీ, అనస్తీసియా, జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తదితర విభాగపు వైద్యులు మరియు ఇంజనీర్లతో కలిసి సందర్శించారు. అనంతరం బిల్డింగ్ మాస్టర్ ప్లాన్ మరియు కన్స్ట్రక్షన్ వర్క్ మరియు పలు అంశాలకు సంబంధించిన ఇంజనీర్లతో ఆరా తీశారు. నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని సంబంధించిన ఇంజనీర్లను అడిగారు, త్వరలో పూర్తి అయ్యేటట్లు చూడాలన్నారు.ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో వచ్చేవారికి తక్షణ ఆరోగ్య సేవలు అందజేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.శ్రీరాములు, డా.సీతారామయ్య, అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రహ్మణ్యం, కెఎంసి వైస్ ప్రిన్సిపాల్, డా.హరిచరణ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, డా.శివబల నగంజన్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్వైడి, డా.రామ్ శివ నాయక్, అనస్తీసియ హెచ్ఓడి, డా.విశాల, ఏపీఎంఎస్ఐడిసి డిఈ, కరీముల్లా, ఎలక్ట్రికల్ డిఈ, జయరాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.