జీవితం.. సేవకు అంకితం..
1 min read– ఏఆర్ ఎస్ఐ రామచంద్రరావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: విధులలో కఠినంగా వ్యవహరించే పోలీసులు… మానవత్వం.. ప్రేమ చూపడంలోనూ అలాగే వ్యవహరిస్తారని పేర్కొన్నారు ఏఆర్ ఎస్ఐ రామచంద్రావు. శుక్రవారం కర్నూలు నగరంలోని శంకర వృద్ధాశ్రమం, కీర్తన అనాధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 2019లో అనారోగ్యం కారణంగా తన కుమారుడు మరణించాడని, అతడి జ్ఞాపకార్థం అనాధశ్రమంలోని వృద్ధులు, పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎస్ఏపీ క్యాంపులో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రామచంద్రారావు… జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు కడప, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లోనూ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. వృద్ధులు, అనాథలకు చేతనైనంత సహాయం చేస్తానని పేర్కొన్న ఎస్ఐ రామచంద్రారావు… సహాయం చేయడానికి ఎందరినో ప్రోత్సహించానని స్పష్టం చేశారు.