గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు
1 min read
లాటరీ ప్రక్రియలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రభుత్వం ఏలూరు జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి లాటరీ ద్వారాఎంపిక చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఎక్సెజ్ అధికారులు లాటరీ ద్వారా పారదర్శకంగా దుకాణాలను కేటాయించారు. జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 14మద్యం దుకాణాలకు 294 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపు దక్కించుకున్న దరఖాస్తుదారుడు వెంటనే అదేరోజు లైసెన్స్ రూ.5,41,667/- లేదా రూ.4,58,333/- మొదటి విడతగా చెల్లించి ప్రయోజనాలు లైసెన్స్ పొందాలి. ఈరోజు కల్లుగీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాల కేటాయింపుకు నాన్ రిఫండబుల్ కింద 5 కోట్ల 80 లక్షల రూపాయల ఆదాయం సమకూర్చడంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. 14 షాపులు కేటాయింపుకు లైసెన్స్ ఫీజు కింద ఈరోజు 72 లక్షల 50 వేల రూపాయల ఆదాయం లభించింది.గత అక్టోబర్ లో నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు ద్వారా 110 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చడంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లా మూడో స్థానంలో నిలిచింది.కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, జిల్లా మధ్య నిషేధ అబార్కి అధికారి ఏ.ఆ వులయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు, సిఐ లు రమేష్ ధనరాజు తదితరులు పాల్గొన్నారు.