NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పుట్టపర్తి ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపిన వాల్మీకి యువ నాయకులు

1 min read

హొళగుంద న్యూస్​ నేడు:   నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాల్లో పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే .పల్లె సిందూర రెడ్డి మేడం  వాల్మీకి బోయలను ఎస్టీ జాబితా  అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరడమైనది. వాల్మీకి బోయ ఎస్టి రిజర్వేషన్ సమస్యపై సానుకూలంగా స్పందించిన స్పీకర్  రఘురాం కృష్ణంరాజు  స్పందించడం జరిగింది అదేవిధంగా  మంత్రి అచ్చెన్న నాయుడు  కూడా ఈ సమస్యపైన స్పందించి కేంద్ర రాష్ట్ర పెద్దలతో చర్చించి వాల్మీకి బోయలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇదే అంశంపై టీడీపీ పార్టీ సీనియర్  సభ్యులు మరియు అసెంబ్లీ చీఫ్ విఫ్  కాలవ శ్రీనివాసులు  ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పెద్దలతో చర్చిస్తున్నారని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా హోళగుంద మండల కేంద్రంలో వాల్మీకి యువ నాయకులు పెద్దహ్యాట పి.శ్రీరంగ రారాయి సిద్దు వందవగిలి తిమ్మప్ప మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి బోయ పడుతున్న కష్టాలను చూసి వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని వాల్మీకి జాతి తరపున అసెంబ్లీలో పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి   మాట్లాడినందుకు వాల్మీకి బోయ జాతి తరపున పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నామని వారు మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో వాల్మీకి బోయలు ఎస్టీలుగా మరికొన్ని జిల్లాలలో బీసీలుగా ఉండడం ఏంటి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకి బోయలను ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో ఏ కుల వృత్తి లేని ఏకైక కులం ఏదైనా ఉంది అంటే అది వాల్మీకి బోయలు మాత్రమే కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ వాల్మీకి బోయలకు కల్పిస్తే అన్ని రకాల వాల్మీకి బోయలకు న్యాయం చేసినట్టు అవుతుందని వారు మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉలిగేశ్  మల్లి తదితరులు పాల్గొన్నారు.

About Author