సమాజాభివృద్ధిలో మహిళ స్థానం గొప్పది: యస్.టి.యు
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని హుసేనాపురం ఉన్నత పాఠశాలలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గత చరిత్రను తెలియజేస్తూ వర్తమానంలో మహిళలు ఎన్నో రంగాలలో ముందంజలో ఉన్నారని, ఎన్నో రంగాలలో అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని,నవ సమాజ స్థాపనలో,సమాజ పురోభివృద్ధిలోనూ మహిళల పాత్ర చాలా గొప్పగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశ రాష్ట్రపతి గా ఒక మహిళ కొనసాగడం, దేశ ఆర్థిక మంత్రిగా మరో మహిళ విధులు నిర్వహిస్తుండడం మహిళా సాధికారత ను సూచిస్తున్నప్పటికీ దేశంలో మహిళా సాధికారత ఇంకా ఆశించినంత స్థాయిలో కనిపించడం లేదని తెలిపారు. స్త్రీకి అన్నిటిలో నిర్ణయాత్మక శక్తి, ఆర్థిక నిర్ణయాలలో, పరిపాలనా అంశాలలో భాగస్వామ్యం ఉండాలని అప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని సూచించారు. మహిళా సాధికారత సాధన దిశగా సమాజంలోని అన్ని వర్గాల వారు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా హుసేనాపురం ఉన్నత పాఠశాల , ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిలకు రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా శాలువా, గిఫ్ట్ లతో సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సర్వజ్ఞుమూర్తి, గోపాల్, విజయ్ చార్లెస్, శ్రీనివాసులు రంగస్వామి , రమేష్ బాబు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయులు రాగవేణి, సుజాత, పద్మావతమ్మ, లక్ష్మీదేవి, జయలక్ష్మి, నీలోఫర్, పద్మావతి,విజయలక్ష్మి,వరలక్ష్మి లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్టియు రాష్ట్ర కౌన్సిలర్ వెంకట్ నాయక్, జిల్లా ఉపాధ్యయవాణి కన్వీనర్ చిన్నపరెడ్డి, ప్యాపిలి మండల అధ్యక్షులు మాజీ మస్తాన్వలి, కార్యవర్గ సభ్యులు శివ తదితరులు పాల్గొన్నారు.
