ప్రజాస్వామ్యం అపహస్యం.. ఓటర్లను డబ్బుతో ప్రభావితం..
1 min readఎన్నికల తీరు మారాలి..ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు
ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి సాకే శైలజనాథ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం డబ్బును వరదలా పారించాయి. డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారంటూ ఏపీ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన డిసిసి అధ్యక్షులు కే బాబురావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఎప్పుడు ఎన్నడు లేని విధంగా ఓటర్లు పోలింగ్ లో పాల్గొనేందుకు రావడం అభినందనీయమని, రాష్ట్రంలో సమస్యత్మకమైన కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ చేసిన కృషిని ఆయన అభినందించారు. అలాగే పోలీస్ శాఖకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే తాయిలాలతో అధికారాన్ని దక్కించుకోవాలని ఆ రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. బహిరంగంగా ఓటరు నాకెంత ఇస్తావ్ అలాగైతే రా అని బహిరంగంగా అభ్యర్థులను ప్రశ్నించే దుస్థితి దారుణం అన్నారు. ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇలాంటి విషయాలపై ప్రజలను ఓటర్లను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని ఓటుతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎలాంటి చట్టాలను తెస్తారో ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు అన్నారు. ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రావాలి తప్ప.. అధికారం కోసం పాకులాడేందుకు అధికారాన్ని కాపాడుకునే చట్టాలను తీసుకురావడం ఇది రాజ్యాంగానికి ప్రజాస్వానికి మంచిది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2024 సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినప్పటికీ ఓటరు బలహీనతలను ఆ రెండు పార్టీలు ఆసరాగా చేసుకున్నాయి. అందుకే ప్రజాస్వామ్య రాజ్యాంగ బద్దంగా ఎన్నిక కావలసిన ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టసభల్లోకి వెళ్లడం లేదన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటరు స్వచ్ఛందంగా ఓటు వేయాల్సిన బాధ్యత ఉండేది. అలాంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. ఎన్నికల పరిస్థితిని గమనించిన తర్వాత తాను ఎన్నికల కమిషన్ కు ఓ లేఖ రాస్తున్నానని అన్నారు. డబ్బు పంచె అభ్యర్థుల పైన రాజకీయ పార్టీల పైన ఎలక్షన్ కమిషన్ గట్టి నిఘ పెంచాలన్నారు. అందుకే ఎలక్షన్ కమిషన్ కి ఈ ఎన్నికల తీరును ప్రశ్నిస్తూ లేఖ రాస్తున్నానన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబు రావు మాట్లాడుతూ టిడిపి వైసిపి పార్టీలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయని ఈ రెండు పార్టీలు బిజెపి చేతిలో కీలుబొమ్మలేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు డిసిసి గౌరవాధ్యక్షులు ఉండవల్లి వెంకటన్న పిసిసి అధికార ప్రతినిధి బి రామాంజనేయులు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థులు కాసిం వలి, రమేష్ యాదవ్, నవీన్ కిషోర్, షేక్ జిలాని భాష, పత్తికొండ ఇన్చార్జి బి క్రాంతి నాయుడు, పిసిసి కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం, డిసిసి ఉపాధ్యక్షులు బి బతకన్న, ఏవి నాయుడు, డిసిసి ప్రధాన కార్యదర్శులు సయ్యద్ నవీద్, కే సత్యనారాయణ గుప్త, వినోద్ కుమార్, చంద్రశేఖర్, రాష్ట్ర ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కోసిగి జిల్లాని, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్ జిల్లా సోషల్ మీడియా చైర్మన్ అమనుల్లా, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ నూర్ అహ్మద్, ఎస్టీ సెల్ చైర్మన్ మారుతీ రావు, సాంస్కృతిక విభాగం చైర్మన్ నాగశేషులు, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాద్రి పాషా, సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, మంత్రాలయం గోవర్ధన్ రెడ్డి మల్లేష్ షేక్ మాలిక్ భాష సిటీ మహిళా కాంగ్రెస్ ఏ లలిత డిసిసి కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ హై శశిధర్ వెంకటస్వామి శేషయ్య, ఎం రవి, రంగన్న, మహిళా కాంగ్రెస్ కె వెంకటలక్ష్మి హైమావతి, సాయి భార్గవి మొదలగు వారు పాల్గొన్నారు.