కౌంటింగ్ ఏర్పాట్లకు సిద్ధం చేసుకోండి
1 min readజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాటు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారులు, సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చేనెల 4వ తేదీన ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీలలో నిర్వహించే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాటు సిద్ధం చేసుకోవాలని రిటర్నింగ్, సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతీ కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉండాలని… ఇందుకు సంబంధించి 760 మంది సిబ్బంది అవసరం అవుతారని ఆ మేరకు సిబ్బందిని సిద్ధం చేయాలని మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. క్యూఆర్ కోడ్ రీడర్, పిజియోన్ హోల్, డ్రమ్స్, వివి ప్యాడ్ పిజియోన్ హోల్ తదితర స్టేషనరీ సామాగ్రిని సమకూర్చాలని మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు మెటీరియల్ ను సిద్ధం చేసుకోవాలని ట్రైనింగ్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తరువాతనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభించాలన్నారు. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని… ఆ మేరకు ఏర్పాటు సిద్ధం చేసుకోవాలని రిటర్నింగ్ అధికారులను సూచించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ పద్మజా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సంబంధిత నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.