హారిజాన్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక గణేష్ నగర్ లోని హారిజాన్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ వార్షికోత్సవము నేడు ఘనంగా జరిగినది .పాఠశాల ఛైర్మన్ ప్రదీప్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ పి. పావని ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ విచ్చేశారు విశిష్ట అతిథిగా రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు శ్రీ జి పుల్లయ్య విచ్చేశారు, ఈ కార్యక్రమంలో డీఈవో శామల్ పాల్ మాట్లాడుతూ ఒక విద్యార్థి భవిష్యత్తులో గొప్పగా ఎదగడానికి పునాది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అలాంటి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లో గొప్ప శిక్షణను అందివ్వడం విద్యార్థులకు తల్లిదండ్రులు అందించే గొప్ప బహుమానం అన్నారు ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు ఇంకా చిన్న పిల్లలే కదా అని భావిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు అలా కాకుండా ప్రీ ప్రైమరీ దశలోని విద్యార్థులకు గట్టి పునాదులు పడేలాగా కృషి చేయాలన్నారు అటువంటి ప్రీ ప్రైమరీ విభాగంలో గొప్ప విద్యను అందిస్తున్నటువంటి పాఠశాల మన కర్నూలు నగరంలో హారిజాన్స్ స్కూల్ అని తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం అనేక కార్పొరేట్ కంపెనీలు ,ప్రభుత్వ ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయన్నారు.అనంతరం రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య మాట్లాడుతూ భవిష్యత్ ప్రణాళికలతో విద్యార్థులకు బోధనోపకరణముల సహాయము చేత విద్యను అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.మా హారిజాన్స్ స్కూల్ లో మేము తప్పక ఫాలో అవుతున్నామన్నారు. ఏ తల్లి తండ్రి అయిన తమ పిల్లలకు ఇచ్చే గొప్ప సంపద ఏమిటి అంటే అది తప్పక మంచి చదువే అన్నారు. మన కళ్ళ ఎదురుగా మన పిల్లలు ఎదుగుతూ ఉంటే పట్టరాని ఆనందం మనకు పట్టరాని ఆనందం మనకు వస్తుందన్నారు పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పి.బి.వి సుబ్బయ్య మాట్లాడుతూ హారిజాన్స్ ఇంటర్నేషనల్ ప్లేస్కూల్ ఏర్పాటు చేయడం కేవలం చిన్న పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదవకాశాన్ని తల్లిదండ్రులు చక్కగా సద్వినియోగపరచుకొని మీ అమూల్య సలహాలను నిరంతరం మాకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లలిత కళా సమితి అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారు తమ అమూల్య సూచనలను విద్యార్థులకు తల్లిదండ్రులకు అందించారు. అనంతరం వివిధ విభాగాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది. చివరిగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
