మహిళలందరూ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి: డా. శాంతికళ
1 min read
కిమ్స్ హాస్పిటల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు
సాధారణ ప్రసవాలపై కిమ్స్ వైద్యుల నిరంతర కృషి
కర్నూలు, న్యూస్ నేడు: ప్రతి మహిళా తమ ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలని సూచించారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ డా. శాంతికళ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలందరూ ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగవారితో సరిసమానంగా సమాజంలో గౌరవం పొందుతున్నారు. అయితే వారిలో వచ్చే సమస్యలపై ఇంకా పూర్తి అవగాహన పొందలేకపోతున్నారు. కాబట్టి 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తప్పని సరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొన్ని వ్యాధులను మనం ముందే పసిగట్టడం వల్ల చికిత్సల చేసి నయం చేసే అవకాశం ఉందన్నారు. అంతేకానీ ఏదైన ఆరోగ్య సమస్య వస్తే తప్పకుండా వైద్యుల వద్దకు వెళ్లాలని అన్నారు. కిమ్స్ హాస్పిటల్ సాధారణ ప్రసవాల కోసం వైద్యులు చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం కిమ్స్ హాస్పిటల్ సిఓఓ డా. సునీల్ సేపూరి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీతో పాటు, గుండె సంబంధిత పరీక్షల కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకవచ్చాం. ఈ అవకాశాన్ని కర్నూలులోని ప్రతి మహిళాకు ఉపయోగపడుతుందన్నారు. మహిళా ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుటుందన్నారు. కాబట్టి ఆరోగ్య సమస్యలపై అవగాహన ఉండాలన్నారు. అలాగే కిమ్స్ కడల్స్ లో సాధారణ ప్రసవాల కోసం వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని.. కిమ్స్ కడల్స్ హాస్పిటల్ నందు సుఖ ప్రసవాలు గురించి గర్భిణీలకు లమాజ్, యోగ, ఫిజియోథెరఫీ, మొదలగు కార్యక్రమాలను చేస్తున్నారని తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సాధారణ ప్రసవాల సంఖ్య పెరగిందన్నారు. గైనకాలజీ విభాగాధితి డా. లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ పురుషులతో పోలిస్తే… మహిళల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ప్రత్యేకంగా మహిళల కోసం కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. క్రమం తప్పకుండా ఆయా పరీక్షలు చేయించుకోవడం వలన భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను అరికట్టవచ్చన్నారు. ప్రధానంగా హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం వలన సర్వెకల్ క్యాన్సర్ ని అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ వైద్యులు డా. అరుణ, డా. శిల్ప, డా. కుసుమ, డా. సుష్మ, డా. శృతి, డా. సాహితి, డా. శ్వేత మరియు సిబ్బంది పాల్గొన్నారు.