PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మరీ ఇంత స్పీడా…!

1 min read

పల్లెవెలుగు వెబ్​: కూల్‌గా.. క్యూట్‌గా కనిపించే రాశీఖన్నాకు భాషతో సంబంధం లేకుండా చేతి నిండా సినిమాలున్నాయి. హీరోయిన్‌గానే కాదు నెగెటివ్‌ రోల్స్‌ కూడా చేస్తోందీ అమ్మడు. రీసెంట్‌గా నాగచైతన్యతో కలిసి ‘థాంక్యూ’ మూవీ కంప్లీట్‌ చేసిన రాశి ప్రస్తుతం మలయాళ మూవీ ‘భ్రమమ్‌’ షూటింగ్‌లో పాల్గొంటోంది. బాలీవుడ్‌ సూపర్‌‌ హిట్ ‘అంధాధున్‌’కి రీమేక్ ఇది. ఒరిజినల్‌లో రాధికా ఆప్టే చేసిన పాత్రను రాశి పోషిస్తోంది. ఈ చిత్రం తెలుగులో నితిన్‌తో ‘మ్యాస్ట్రో’గా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా దర్శకుడు కె.రవిచంద్రన్ తెరకెక్కిస్తన్నాడు. ఆల్రెడీ చాలావరకు షూట్ కంప్లీట్ అయ్యింది. కానీ లాక్‌డౌన్ పెట్టడంతో బ్రేక్ ఇచ్చి, మళ్లీ ఈమధ్యనే పాండిచ్చేరిలో షూట్ స్టార్ట్ చేశారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వర్క్ చేస్తున్నారు. ఇది చాలా చాలెంజింగ్‌గా ఉందంటోంది రాశి. సినిమా చాలా బాగా వస్తోందని.. పృథ్విరాజ్, రవిచంద్రన్‌ లాంటి టాలెంటెడ్ వ్యక్తులతో కలిసి పని చేయడం ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉందంటోంది రాశి.. మళ్లీ థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడే రోజు కోసం చూస్తున్నానంటోంది. అంటే ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజవుతుందన్నమాట. దీంతో పాటు రాశి గోపీచంద్‌తో నటిస్తున్న ‘పక్కా కమర్షియల్‌’ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. తమిళంలో ‘తుగ్లక్‌ దర్బార్‌‌’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. సర్దార్‌‌, అరణ్మనై 3, మేధావి, సైతాన్‌కా బచ్చా చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇక హిందీలో రాజ్, డీకే తెరకెక్కిస్తున్న వెబ్‌సిరీస్‌లో షాహిద్‌ కపూర్‌‌తో పాటు నటిస్తోంది. అజయ్‌ దేవ్‌గన్‌ ‘రద్ర’ వెబ్‌ సిరీస్‌లోనూ ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇలా స్పీడు పెంచేసి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసేస్తోంది రాశి.

About Author