NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జడ్పీహెచ్ఎస్ నన్నూరులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు: శుక్రవారం ఉదయం జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాల నన్నూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ప్రణేష్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సభా కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రణేష్ కుమార్ మాట్లాడుతూ  నేటి మహిళలు సామాజిక ,ఆర్థిక, ఉద్యోగ ,రాజకీయ రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారని, ముఖ్యంగా స్త్రీ లు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ అభివృద్ధి అధికంగా ఉంటుందని మరియు స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని ఆయన అన్నారు.మహిళల హక్కులు, సాధికారత, సమానత్వం  అనే ముఖ్యంశాలపై మాట్లాడుతూ మహిళల సమగ్ర అభివృద్ధికి సమాజంలో  ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు నిర్వహించి అందరిని ఆలరింప చేశారు.చివరగా పాఠశాలలో పనిచేసే  తోటి ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులందరినీ ప్రత్యేకంగా అభినందించి శాలువాలతో మరియు కిరీటంతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ సహాయక ఉపాధ్యాయులు గౌరీ నందన్, లక్ష్మీనారాయణ, పెద్ద స్వామి ,ప్రసాదు, వెంకటేశ్వర్లు, రమణ, కుమార్ , ఇతర ఉపాధ్యాయ బృందం ,విద్యా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author