మహిళలకు భాద్యతలు అప్పగిస్తే అద్భుతాలు సృష్టిస్తారు
1 min read
జిల్లా టిడిపి అధ్యక్షులు తిక్కారెడ్డి వెల్లడి.
కర్నూలు, న్యూస్ నేడు: యత్ర నార్యంతు పూజ్యతే .. తత్రే దేవతా ” ఎక్కడ మహిళలు పూజింపబడుతారో అక్కడ దేవతలుంటారన్నది నగ్నసత్యమనీ కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు. ఈ రోజు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం, కర్నూలు నందు పార్లమెంట్ తెలుగుమహిళ అధ్యక్షురాలు శ్రీమతి యస్. ముంతాజ్ గారి ఆధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీ కె.వి. సుబ్బారెడ్డి శ్రీమతి కె. వి. పద్మలతారెడ్డి శ్రీమతి కప్పట్రాళ్ల బొజ్జమ్మ, బి. సంజీవలక్ష్మి లు ముఖ్యులుగా హాజరైన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడటం జరిగినది.కార్యక్రమంలో భాగంగా మహిళలు బారీ కేక్ ను కట్చేసి ఒకరికొకరు పంచుకొన్నారు. అనతరం పార్టీ నాయకులు విధ్యాసంస్థల అధినేత కె.వి. సుబ్బారెడ్డి మహిళలకు కుట్టుమిషన్లు, మరియు సైకిళ్లను అందజేశారు. కార్యక్రామాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని విషయాలలోను పురుషులతో సమానంగా పోటిపడుతూ ముందుకు వెల్తున్నారనీ తెలియజేశారు. తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు కీ,, శే,, శ్రీ నందమూరి తారక రామారావు మహిళల పట్ల భావంతో వారిని అన్ని విధాలుగా ప్రోత్సాహించారనీ, ఆస్తిలో సమాన హక్కును మహిళలు పొందేలా చేశారనీ, అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు రాజకీయాలలో కూడా వారికి రిజర్వేషన్లు అమలు చేశారనీ, దీనితో ఎంతో మంది ఉన్నత పదవులను కూడా అదిష్టించారనీ, అనాడు యన్.టి.ఆర్. చూపిన చోరతో మహిళలు రాణించగలిగారనీ, వారి తర్వాత ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిననారా చంద్రబాబునాయుడు రాజకీయాలలో మహిళలను ప్రోత్సాహించడమేకాక అత్యున్నతమైన స్పీకర్ పదవికి ఒక యస్.సి మహిళ శ్రీమతి కావలి ప్రతిభాభారతి ని ఎంపికచేశారనీ, అలాగే మహిళలు వృద్ధిలోకి రావలన్న ఉద్దేశంతో పొదుపు గ్రూపుల ఏర్పాటులోను, డ్వాక్రా సంఘాలు, మెప్మా గ్రూపులకు నాందీ పలికారనీ, ఈ రోజు ఆర్థికంగా మహిళలు నిలదొక్కుకోగలిగారనీ వివరించారు. ఈ రోజు భారత రాష్ట్రపతిగా, దేశ ఆర్థిక మంత్రిగా, డిల్లీ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర హెూం మంత్రిగా మహిళలే కొళినసాగుతున్నారనీ, ఇదిహిళాలోకానికి గర్వకాణంగా ఉన్నదనీ వివరించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి, మల్లేశ్వరి, రాణి, జానకమ్మ, నాజీమ్ మొదలగు మహిళలతో పాటు పార్టీ నాయకులు పి. రామచంద్రనాయుడు. పి.హనుమంతరావు చౌదరి, కె.మహేష్ గౌడ్, కె. చంద్రకాంత్, బాలవెంకటేశ్వరరెడ్డి, సత్రం రామక్రిష్ణుడు, బెత క్రిష్ణుడు, ఆర్. బాబురావు, యస్. షేక్షావలి, ఆదిత్యారెడ్డి, పాల్గొన్నారు.