ముఖ్యమంత్రి రాజీనామా !
1 min readపల్లెవెలుగు వెబ్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రాజీనామా చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవి నుంచి తీరథ్ సింగ్ వైదొలిగారు. శుక్రవారం రాత్రి గవర్నర్ బేబిరాణిని మౌర్యని కలిసి రాజీనామా పత్రాన్ని అందించారు. నూతన సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం డెహ్రాడూన్ లో భేటీ కానున్నారు. తీరథ్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నాలుగు నెలలు కూడ పూర్తీ కాలేదు. సత్పల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్ ల పేర్లు ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితాలో ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో తీరథ్ సింగ్ .. బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తీసుకొచ్చారు. ఆయన హయాంలో కుంభమేళా నిర్వహించడం పై విమర్శలు తలెత్తాయి. పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తీరథ్ సింగ్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని సమాచారం.