NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన.. కర్నూలు జిల్లా ఎస్పీ

1 min read

ఆదోని , న్యూస్​ నేడు: కర్నూలు జిల్లా,  ఆదోని  మండలం , పెద్ద తుంబళం  పోలీసు స్టేషన్ పరిధిలోని  పాండవగల్లు  గ్రామం  జాలీమంచి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని చేరుకుని  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  మంగళవారం పరిశీలించారు.రెండు బైక్ లను కర్ణాటక ఆర్టీసీ  KA 37 F 0711  నెంబర్ గల బస్సు ఢీ కొన్నది.ఈ ప్రమాద ఘటన స్ధలంలో  నలుగురు మృతి చెందారు.   చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఆదోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్  కు మృత దేహాలను తరలించారు. ప్రమాద కారణాల పై జిల్లా ఎస్పీ  ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవలసిన చర్యల పై పోలీసు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. వాహానాలు నడిపే సమయంలో సురక్షితంగా , క్షేమంగా గమ్యాలను చేరుకోవాలని తెలిపారు. జరిగిన విషయం.ఐదుగురు  రెండు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. పాండవగల్లు గ్రామం వద్ద రెండు బైక్ లను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.   ఘటనాస్థలిలో నలుగురు, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. 1)            ఒక  బైక్ పై కుప్పగల్ నుంచి ఆదోని వస్తున్న దంపతులు … ఈరన్న ( 25),  ఆదిలక్ష్మి. (20) 2)         మరో బైక్  పై  వెళుతున్న కర్ణాటక రాష్ట్రం, మాన్వికి  చెందిన ముగ్గురు వ్యక్తులు… దంపతులు  హేమాద్రి (40) నాగరత్న(35), కుమారుడు దేవరాజు(22)  .జిల్లా ఎస్పీ తో పాటు ప్రమాద సంఘటన స్ధల పరిశీలనలో ఆదోని డిఎస్పీ హేమలత , ఆదోని రూరల్ సిఐ నల్లప్ప, పెద్ద తుంబళం ఎస్సై మహేష్ కుమార్  ఉన్నారు.

About Author