విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..
1 min readజిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు:సీఐలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా ఎస్పీ ఎన్.రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నందికొట్కూరు రూరల్ మరియు పట్టణ సీఐలు విజయభాస్కర్,ప్రకాష్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 40 మంది స్థానిక పోలీస్ అధికారులు వారి సిబ్బందితో మిడుతూరు మండలంలోని ఉప్పలదడియ, మాసపేట,కలమందలపాడు గ్రామాల్లో పురవీధుల వెంట కాలినడకన నడుచుకుంటూ పోలీసులు కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామాల్లో ప్రజలందరూ వివాదాలకు దూరంగా ఉండాలని శాంతియుతంగా మెలగాలని జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని రౌడీ షీటర్లు నేరచరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచడం జరిగిందని నేడు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగిందని వచ్చేనెల 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఎన్నికల్లో గెలిచినవారు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు క్రాకర్స్ కాల్చడానికి అనుమతి లేదని ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు గ్రామాల్లో చేపడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. పల్లెల్లో ప్రజలకు భరోసా కల్పించేందుకే ఈ పోలీసుల కవాతు నిర్వహించడం జరుగుతుందని ఎన్నికల నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నందికొట్కూరు రూరల్ మరియు పట్టణ సీఐలు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మిడుతూరు ఎస్ఐ ఎం.జగన్ మోహన్, జూపాడుబంగ్లా ఎస్సై లక్ష్మీనారాయణ, బ్రాహ్మణకొ ట్కూరు ఎస్సై నాగార్జున,ముచ్చుమర్రి ఎస్సై జయ శేఖర్ మరియు సర్కిళ్ల లోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.