24,25న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె
1 min read
యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపుమేరకు సమ్మె చేస్తున్నట్టు ప్రకటన
జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షులు డి శ్రీనివాస్ మోహన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : 2025 మార్చి 24, 25 తేదీలలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపుమేరకు సమ్మె చేస్తున్నట్లు ఏలూరు జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షులు డి శ్రీనివాస్ మోహన్ తెలిపారు. మార్చి 24 25 తేదీలలో జరుగుసమ్మెలో భాగంగా మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్ బి ఐ మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగులు యు ఎఫ్ బి యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మోహన్ మాట్లాడుతూ బ్యాంకులలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే నియమించాలని, వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని, తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని, ఐబీఏ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం మిగిలిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వలే గ్రాట్యూటీ 25 లక్షలకు పెంచి ఇన్కమ్ టాక్స్ రాయితీ ఇవ్వాలని, బ్యాంక్ ఉద్యోగులపై జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ బి ఈ ఏ నాయకులు ఎన్ లక్ష్మణరావు, ఏ ఐ బి ఓ సి నాయకులు శ్రీనివాస్, ఎన్ సి బీ ఇ నాయకులు రత్న విమల్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కే జే సత్యనారాయణ, వంకినేని కిషోర్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఏలూరు నగరంలోని వివిధ బ్యాంకుల నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.