కోవాగ్జిన్ 77.8 సమర్థవంతం
1 min readపల్లెవెలుగు వెబ్ : కరోన పై కోవాగ్జిన్ 77.8 సమర్థవంతంగా పనిచేస్తుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలు భారత్ బయోటెక్ విడుదల చేసింది. కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిలో కోవాగ్జిన్ టీకా 93.4 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్టు తెలిపింది. డెల్టావేరియంట్ పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్టు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల ప్రకటించారు. తీవ్ర లక్షణాలు నిలువరించి ఆస్పత్రిలో చేరే అవసరాన్ని కోవాగ్జిన్ తగ్గిస్తోందని వివరించారు.