పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ..
1 min read
బాలకృష్ణ అభిమాని శ్రీనివాసులు పంపిణీ.
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని నెహ్రూ నగర్ గ్రామంలోని జిల్లా జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 56 మంది విద్యార్థినీ విద్యార్థులకు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వీరాభిమాని బండారు శ్రీనివాసులు ప్యాడ్లు, పెన్నులు పెన్సిళ్లు తదితర వస్తువులను విద్యార్థులకు బుధవారం అందజేశారు.గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు లోకానంద రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు మాండ్ర ఉమాదేవి సహాయ సహకారాలతో టీడీపీ నాయకులు బండి జయరాజు సలహా మేరకు నందమూరి బాలకృష్ణ@మోక్షజ్ఞ సేవా సమితి అధ్యక్షులు బండారు శ్రీనివాసులు ఎగ్జామ్స్ పాడ్స్, పెన్నులు,పెన్సిల్,పంపిణీ చేసినట్లు శ్రీనివాసులు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత మంచి ప్రతిభ కనబరచాలని పాఠశాల కు తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి మంచి మార్కులు సాదించాలని అయన విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా పదవ తరగతిలో ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థానాల్లో మంచి ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు వెండి పతకాలు అందజేస్తామని అన్నారు. మెటీరియల్ పంపిణీ చేయడం పట్ల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సభ్యులు ఫరూక్ బాష, ఉపాధ్యాయులు,శ్రీనివాసరెడ్డి, స్వామినాధమ్,విజయభాస్కర్,బెంజిమెన్, విజయ కుమారి, భార్గవి,జయలక్ష్మి, పాల్గొన్నారు.