జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీలో అష్టావధాన కార్యక్రమం
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: కర్నూల్ మండలం నందనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిలిటరీ కాలనీలో గురువారం ఉదయం అష్టావధాన కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి రాజేశ్వరి అధ్యక్షత వహించారు.అష్టావధానివ వక్తగా దంత వైద్యులు డాక్టర్ బోరెల్లి హర్ష హాజరవ్వగా, కర్నూలు జిల్లా ఉప విద్యాధికారి హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ అష్టావధాన కార్యక్రమంలో డాక్టర్ బోరెల్లి హర్ష మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి అష్టావధాన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, జీవితంలో ఎదురయ్యే కష్టతరమైన సవాళ్లను సులభంగా ఎదుర్కోవటానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో మెలకువలు తెలుసుకోవచ్చు అన్నారు. ఇది 22వ అష్టావధాన కార్యక్రమం అని చెప్పారు. తర్వాత ముఖ్య అతిథులు జిల్లా ఉప విద్యాధికారి హనుమంతరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ఈ అష్టావధానము చాలా ప్రత్యేకమైనదని తెలుగు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. చివరగా ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి మాట్లాడుతూ దంత వైద్య విద్యార్థి బోరెల్లి హర్ష చిన్న వయసులోనే అష్టావధాన ప్రక్రియ ను నిర్వహించడం చాలా అభినందనీయమని , రాబోయే ముందు తరాల వారికి ఆదర్శంగా నిలవాలని ఆశీర్వదించారు. ఇలాంటి అష్టావధానాలు చేయడానికి సాహితీవేత్తలు, ముఖ్యంగా యువకులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ అష్టావధాన కార్యక్రమంలో అవధానం సుధాకర్ శర్మ ,మారేడు రాముడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తొగట సురేష్ , తెలుగు గేయ రచయితలు మరియు తెలుగు పండితులు చంద్రమౌళిని, మాదిరాజు వరలక్ష్మి, విశ్రాంత ఉపాధ్యాయులు పాండురంగయ్య, రాఘవయ్య ,శ్రీనివాసులు, దేవవరం, సాహిత్య అభిమానులు గ్రామ ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.