గౌరిగోపాల్ హాస్పిటల్లో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అత్యవసర పరిస్థితుల్లో మనిషి ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ చేసే విధానంపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలని కర్నూలు నగరంలోని ప్రముఖ గౌరిగోపాల్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. అంతర్జాతీయ అత్యవసర చికిత్స దినోత్సవం సందర్బంగా గౌరిగోపాల్ హాస్పిటల్లో సీపీఆర్‌పై ఆసుపత్రి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీఆర్ ఏ విధంగా చేసి పేషెంట్ ప్రాణాలు కాపాడగలగాలో వివరించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ గుండెజబ్బులు వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయన్నారు. ఎంతో మంది ఉన్నట్టుండి గుండె సంబంధిత జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. హార్ట్ఎటాక్ వచ్చిన సమయంలో ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లలేని సందర్భంలో సీపీఆర్ చేసి ప్రథమ చికిత్సను అందించాలన్నారు. అనంతరం సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఆకస్మిక గుండెపోట్ల నుండి ప్రజలను రక్షించేందుకు అన్ని వర్గాల ప్రజలకు దీనిపై అవగాహన ఉండాలన్నారు. తమ గౌరిగోపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివశంకర్ రెడ్డి, డాక్టర్ మాలకొండయ్య, డాక్టర్ ఖాద్రి, డాక్టర్ చంద్రశేఖర్, డ్యూటీ డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.