లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తికి జీవిత కాల కఠిన కారాగార శిక్ష
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: 2021 వ సంవత్సరము ఆగస్టు నెల 13 వ తేదీన హోలగుంద మండలం, బొమ్మగుండన హళ్లి గ్రామమునకు చెందిన బాధితురాలు వయసు 7 సం.లు తన ఇంట్లో ఒంటరిగా వుండగా, తన ఇంటిపక్కల un వున్న బోయ రంగముని, వయసు 28 సం.లు. S/o గాదిలింగ అను వ్యక్తి బాదితురాలు ఇంట్లోకి ప్రవేశించి ఆమె పై లైంగిక దాడికి పాల్పడడము జరిగింది. ఈ విషయములో బాదితురాలు తల్లి అయిన కురువ రేణుక ఫిర్యాదు మేరకు 13.08.2021 వ తేదీన హొలగుంద Cr.No.235/2021 U/sec: 506 IPC and Sec 6 of Protection of Children from Sexual Offences (POCSO) Amendment Act, 2019 కేసునమోదు చేయడమయినది. ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన K.S. వినోద్ కుమార్ DSP, Adoni కేసును దర్యాప్తు చేసి, దర్యాప్తు ముగిసిన అనంతరము గౌరవ SPECIAL COURT FOR TRAIL OF OFFENCES UNDER THE POCSO 5నందు చార్జిషీట్ ధాకలు చేయడమయినది. ఈ కేసును గౌరవ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి శ్రీ భూపాల్ రెడ్డి విచారణ జరుపగా, ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన V. వేంకటేశ్వర రెడ్డి వాదించడము జరిగింది. వాదోపవాదాలు ముగిసిన అనంతరము ముద్దాయి అయిన రంగముని పై నేరము ఋజువు కావడముతో పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి శ్రీ భూపాల్ రెడ్డి ముద్దాయి రంగమునికి జీవిత కాల కఠిన కారాగార శిక్ష(అతడు జీవించి ఉన్నంతవరకు) విదించి, 20,000/- జరిమానా కూడా వేయడము జరిగింది. ఈ సంధర్భముగా కర్నూల్ జిల్లా SP దర్యాప్తు అధికారి K.S. వినోద్ కుమార్ DSP ని మరియు హోలగుంది PS కోర్టు కానిస్టేబుల్ షేక్షా వలిని మరియు ఇతర అధికారులను అబినందించదము జరిగింది.