జూపాడుబంగ్లా లో రోడ్డు వేయాలని ఎమ్మార్పీఎస్ ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని మండ్లెం గ్రామంలోని నేషనల్ హైవే నుండి మండ్లెం గ్రామంలోని మారెమ్మ గుడి వరకు రోడ్డు వేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ ఎల్.స్వాములు మాదిగ ప్రజలతో కలిసి సోమవారం రోడ్డుపై ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవే రోడ్డుకు గ్రావెల్ మట్టి,బిల్కు భారీ వాహనాలలో తోలడం వల్ల గ్రామాల్లో ఉండే మట్టి రోడ్లు చిందర వందరమై ప్రజలు నడవడానికి కూడా వీలు లేదని వీటివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ ప్రజలు నేషనల్ హైవే అధికారులకు సహకరించినా హైవే అధికారులు మాత్రం చింద్రమైన రోడ్లను మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేయడం వల్ల ప్రజలు నడవడానికి వీలు లేకుండా పోతుందని అలాగే టూ వీలర్ ఫోర్ వీలర్స్ వాహన చోదకులు కిందపడి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వెంటనే కర్నూల్ నుండి ఆత్మకూరు వరకు ఎక్కడెక్కడ అయితే నేషనల్ హైవేకి ఆనుకొని గ్రామాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని నేషనల్ హైవే అధికారులు పనులు దక్కించుకున్న గుత్తేదారులకు చెప్పి రోడ్లు వేయించాలని ఆయన డిమాండ్ చేశారు లేదంటే వివిధ గ్రామాల ప్రజలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.