పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి
1 min readపాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు.సోమవారం స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి ఇంజనీరింగ్ బ్లాక్ లోని స్ట్రాంగ్ రూమ్ ను, కౌంటింగ్ ఏర్పాట్లను పాణ్యం రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పరిశీలించారు.ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ ముందుగా ఇంజనీరింగ్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి ఎంట్రీ రిజిష్టర్ లో సంతకం చేశారు. అనంతరం కౌంటింగ్ హాలును పరిశీలించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. అదే విధంగా కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణలో పూర్తి ప్రక్రియను పరిశీలించడం జరుగుతుందన్నారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ హాలులో 14 టేబుల్స్ ఏర్పాటు చేశామని తద్వారా 26 రౌండ్లలతో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా కౌంటింగ్ కేంద్రంలోనికి మొబైల్ ఫోన్లు అనుమతి ఉండదన్నారు.జాయింట్ కలెక్టర్ వెంట కల్లూరు తహశీల్దార్ మునివేలు, ఆర్ అండ్ బీ డిఈ భారతి తదితరులు ఉన్నారు.