NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ పది’ విద్యార్థులకు… విజయోస్తు..

1 min read

నెగిటివ్​ ఆలోచనలు మనసులోకి రానివ్వొద్దు..

  • ఆత్మస్థైర్యంతో మెలగండి… ప్రణాళికతో రాయండి…
  •  తల్లిదండ్రులు విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోండి
  • ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, మానస క్లినిక్​ అధినేత డా. రమేష్​ బాబు

కర్నూలు, న్యూస్​ నేడు :  పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, మానస క్లినిక్​ అధినేత డా. రమేష్​ బాబు . రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి 31 వ తేదీ వరకు జరుగు పబ్లిక్​ పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మస్థైర్యంతో మెలగాలన్నారు. కర్నూలు నగరం ఎన్​ ఆర్​ పేటలోని మానస క్లినిక్​ అధినేత, ప్రముఖ సైకియాట్రిక్​ వైద్యులు డా. రమేష్​ బాబు విలేకరులతో మాట్లాడారు.  కర్నూలు జిల్లాలో  ప్రైవేట్​, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మొత్తం 40,776 మంది పదో తరగతి పబ్లిక్​ పరీక్షలు రాయనున్నారని, వీరందరూ విజయవంతంగా పరీక్ష రాయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు వారికి సహకరించాలన్నారు. విద్యార్థులు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని, నెగిటివ్​ ఆలోచనలు మనసులోకి రానివొద్దన్నారు. ఏడాదంతా చదివిన పాఠాలను ఒకే నెలలో గుర్తు చేసుకుంటూ రాయాలని, ఇందులో భయపడాల్సిందేమీ లేదన్నారు. ప్రతి రోజు జరిగిన తరగతి పాఠాలను ఎప్పటికప్పుడు నేర్చుకొని ఉంటారని,  పరీక్ష మాసంలో మాత్రం మరోసారి చదివితే సరిపోతుందన్నారు. పబ్లిక్​ పరీక్షలు అంటేనే టెన్షన్​..భయం..తో కొందరు విద్యార్థులు వణికిపోతుంటారని, అలాంటి పరిస్థితి రానివ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాలన్నారు.  విద్యార్థుల నైపుణ్యత, శ్రద్ధ ను ప్రోత్సహిస్తూ.. వారికి అనుకూలమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని  పేర్కొన్న డా. రమేష్​ బాబు….  శాస్ర్తీయ పద్ధతి.. చక్కటి ప్రణాళికతో చదివిన విద్యార్థులు పరీక్ష సమయంలో నిమిషం కూడా వృథా చేయకుండా రాస్తారని, అటువంటి వారు సత్ఫలితాలు సాధిస్తారన్నారు. పరీక్ష రోజు ఉదయం అల్పాహారం భుజించి… హాల్​ టిక్కెట్​, పెన్ను, పెన్సిల్​ తదితరవి మరిచికపోకుండా నిర్ధిష్టమైన సమయం కన్నా అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని ఈ సందర్భంగా మానస క్లినిక్​ అధినేత,  సీనియర్​ సైకియాట్రిక్​ వైద్యులు డా. రమేష్​ బాబు సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *