PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా ఆరోగ్యానికి బి సి జి టీకా

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల :  మండల కేంద్రమైన గడివేముల చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  ఆధ్వర్యంలో సచివాలయ ఏఎన్ఎం భారతి. ఆశా వర్కర్లు గురువారం నాడు గ్రామస్తులకు బీసీజీ టీకా వేశారు భారతి మాట్లాడుతూ  ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం టీకా పంపిణీ చేయడం చాలా సంతోషమని ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని  కోరారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ సూపర్వైజర్  మాట్లాడుతూ ఈ టీకా ముఖ్యంగా 60 ఏళ్ల వారికి వృద్ధులకు షుగర్  బీపీ వ్యాధిగ్రస్తులకు వేయడం జరుగుతున్నదని టీకా వల్ల  అనేక ఉపయోగాలు ఉన్నాయని  షుగర్ వ్యాధిగ్రస్తులు ఐదు సంవత్సరాలలోపు టీబీ వచ్చి ఉన్నవారికి చికిత్స తీసుకుంటున్న వారికి వారి కుటుంబ సభ్యులకు ఇది ఎంతో ఉపయోగకరమని శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు క్షయ వ్యాధి దాడి చేస్తుందని మన శరీరాన్ని  కాపాడుకోవడానికి బీసీజీ టీకా ఎంతో ఉత్తమమైనదని ఉచితంగా ప్రభుత్వం అందజేస్తున్న ఈ టీకాను ప్రతి ఒక్కరు వేయించుకోవాలని వివరించారు ప్రజలు పాల్గొన్నారు.

About Author