పది పరీక్షలకు హాజరైన దివ్యాంగులు…
1 min read
దివ్యాంగ విద్యార్థి రనూల్ను వీల్చేర్లో తీసుకొస్తున్న తల్లి
సరస్వతిని ఎత్తుకొనున్న పరీక్షా కేంద్రానికి తండ్రి
హొళగుంద , న్యూస్ నేడు: సోమవారం ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో భాగంగా హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని రెండు సెంటర్లో విద్యార్థులకు డెస్క్లు ఏర్పాటు చేయక పోవడంతో నేలమీదే కూర్చూని పరీక్షలు వ్రాశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏ, బీ రెండు సెంటర్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, కేజీలీవీలో ఒక్కొకటి చొప్పున మొత్తం నాలుగు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో మండలానికి సంబంధించి హొళగుంద, హెబ్బటం, ఎల్లార్తి, గజ్జహళ్లి, సుళువాయి, హొళగుంద హైన్కూళ్లతో పాటు కేజీబీవీ విద్యార్థినిలు కలిపి మొత్తం 789 మంది పరీక్షలు వ్రాస్తున్నారు. అందులో హొళగుంద ఏ, బీ సెంటర్లలో 346 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తుండగ కేవలం 80 వరకు మాత్రమే డెస్క్లు ఏర్పాటు చేశారు. దీంతో ఈ విషయం పై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓలను నిలదీశారు. విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు స్థానిక అధికారులను కూడా మందలించారు. వెంటనే డెస్క్ ఏర్పాటు చెయాలని ఆదేశించడంతో వారు వాటిని సరి చేయడానికి వరుగులు పట్టారు. కాగా పాఠశాలలో డెస్క్లలు మంజూరు కాకపోవడంతో అధికారులే డబ్బులు పెట్టుకుని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో లోలోపల మధన వస్తున్నారు. ఇదిలా ఉండగ ఆయా సెంటర్లలో ప్రైవేట్ విద్యార్థులు మినాహించి 606 మందికి గాను 591 మంది పరీక్షలు వ్రాయగ 15 మంది గైరాజరైనట్లు ఎంఈఓ-1, 2 సత్యనారాయణ, జగన్నాధం తెలిపారు. అదేవిధంగా ఆయా గ్రామాల నుంచి 11 మంది దివ్యాంగ, ఇతర లోపలు కలిగిన విద్యార్థులు తమ సహాయకులతో కలిసి పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజు లాంగ్వేజ్ సబ్జెక్లైన కన్నడ, తెలుగు, ఉర్లు పేవర్-1 పరీక్షలను ప్రశాంతంగా వ్రాశారని చెప్పారు. ఆయా సెంటర్ల డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అబుల్మునాఫ్, ప్రసాద్, మావలీ, సుధాకర్, చీఫ్లుగా కబీర్సాబ్, పంపాపతిగౌడ్, రమణయ్య, మహమ్మద్ హుసేన్లు.

