విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా… ఏఐటీయూసీ
1 min read
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: పట్టణంలో విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాన్ని అమలు చేయాలని కోరుతూ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునేప్ప, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, డివిజన్ నాయకులు వీరేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టార్ట్ మీటర్లు వస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు హామీ ఇవ్వడం జరిగిందనీ వారు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్న మీటర్ రీడర్లకు ప్రత్యన్న ఉపాధి చూపించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని ఈ సందర్భంగా వారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఎన్నికల ముందు ఇచ్చినట్టు వాగ్దానం ప్రకారంగా వారికి ప్రత్యామ్నాయం చూపించి,ఎస్కో అకౌంట్ ద్వారా ప్రతినెల వేతనాలు చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేశారు.సి.ఎం.డీ లు ఏస్కో అకౌంట్ అమలు చేయమని ఆదేశించిన,క్రింది స్థాయి అధికారులు అమలు పరచడం లేదు. సబ్ స్టేషన్ లో ఐటిఐ అర్హత ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్ గాను అలాగే వాచ్ అండ్ వార్డ్ గా నియమించాలనీ నూతనంగా ఏర్పడిన సర్కిల్ ఆఫీసులో అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్ గాను, అటెండర్స్ గా, వాచ్మెన్ గాను నియమించాలి. 12 రోజులు రీడింగ్ అనంతరం మీటర్ రీడర్లను డిలిస్టులకు మీటర్లు మార్చడంలో ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఏడిఈ నాగేంద్ర ప్రసాద్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ల రీడింగ్ యూనియన్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వీరేష్, వీర శేఖర్, ఉరుకుందు,ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు, పట్టణ కార్యదర్శి విజేంద్ర, కుమార్ స్వామి, నరసప్ప, చంద్రశేఖర్, నరసింహులు, జోష్ రాజ్, ఉప్పర ఉరుకుందు, కిరణ్ కుమార్, రంగన్న, మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు,