పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
1 min read
తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహన కల్పించిన ఎంపీడీవో
చెన్నూరు, న్యూస్ నేడు: పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పై ప్రజల అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని గుర్రంపాడు గ్రామపంచాయతీలో పర్యటించి అక్కడి ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త, వ్యర్థాలపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ముఖ్యంగా డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ ను వాడరాదని తెలిపారు. ఇంటి పరిసరాలలో మురుగునీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. ఎక్కడైనా పరిసర ప్రాంతాలలో గుంతలు ఉంటే ఎప్పటికప్పుడు వాటిని పూడ్చివేయాలని తెలిపారు. అదేవిధంగా రిక్షా బండితో గ్రామంలో పరిసరాల పరిశుభ్రత పై, ఎస్ డబ్ల్యూ పిసి లో అనుసరిస్తున్న వ్యర్థాలతో ఎరువుల తయారి, విషయాలను గ్రామస్తులకు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ పిఓపిఆర్డి సురేష్ బాబు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, గ్రామస్తులు పాల్గొన్నారు.