పెండింగ్ బిల్లులకై ఎస్సీ ఎస్టీ బీసీ గృహ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి
1 min read
ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు
చెన్నూరు, న్యూస్ నేడు: ప్రభుత్వ పక్క గృహ నిర్మాణాలు చేపట్టిన ఎస్సీ, ఎస్టీ, బిసిలు తమ గృహాలకు కొరకు అదనపు లబ్ధి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, హౌసింగ్ ఏఈ మేనిల్ తెలిపారు. మంగళవారం వారు ఎంపీడీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎస్సీ ,ఎస్టీ ,బిసి గృహ నిర్మాణాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందన్నారు. అందులో భాగంగా అధిక సహాయం కొరకు వివిధ దశల్లో ఉన్న ప్రభుత్వ పక్కా గృహాలకు అదనంగా లబ్ది పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని వారు తెలియజేశారు.ప్రధానమంత్రిఆవాస్ యోజన పథకంలో మండలానికి సంబంధించి బిసి లకు సంబంధించి 18 మంది, ఎస్సి లు 31 మంది గృహ నిర్మాణ లబ్దిదారులున్నారని, వీరికి ప్రభుత్వంఅదనంగా రూ.50 వేల రూపాయలు అలాగే ఎస్టీ లకు రూ.75 వేల రూపాయలు అదనంగా మంజూరు చేయడము జరిగినదని తెలిపారు, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని వారి గృహాలను త్వరగా పూర్తి చేసుకోవాలని వారు తెలియజేశారు.