“అన్న క్యాంటీన్” ను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: నిరుపేదల ఆకలి తీర్చి పేద ప్రజలకు అండగా వుండే అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సముదాయంలో నున్న అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆహార పదార్థాలు ఇస్తున్నారా లేదా, ఉదయం అల్పాహారానికి ఎంత మంది వస్తున్నారు, మధ్యాహ్న, రాత్రి భోజనాలకు ఎంతమంది పేదలు వస్తున్నారన్న విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లలో రోజువారీగా నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలను ఇవ్వాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలిస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఒక్కొక్కరి నుంచి పూటకు ఐదు రూపాయలు చొప్పున నామమాత్రపు ధరను వసూలు చేసి ఆహార పదార్థాలను ఇస్తున్నామని సిబ్బంది కలెక్టర్ కు నివేదించారు.