ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు
1 min read
పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన ఎంఈఓ-2 సునీత
చెన్నూరు , న్యూస్ నేడు : ఎండలు ఎక్కువగా ఉన్న కారణం చేత పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు త్రాగునీటి, వైద్య సదుపాయాలతోపాటు అన్ని సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేసినట్లు బుధవారం ఎంఈఓ-2 సునీత తెలిపారు. చెన్నూరు లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, అలాగే జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, తోపాటు మండలంలోని కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చిన్నమాచుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు అయిన ఆర్ఆర్ పాఠశాల, శ్రీ భారతి పాఠశాల, రాజరాజేశ్వరి పాఠశాల లో చదివే విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు, మండల వ్యాప్తంగా మొత్తం 312 మంది విద్యార్థులు ఉండగా, బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశా లలోని రెండు పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు 311 మంది హిందీ పరీక్షకు హాజరు కాగా ఒకరు గైర్హాజర్ అయినట్లు ఆమె తెలిపారు. బాలికలు 165 మంది కాగా బాలురు 147 మంది ఉన్నారని ఆమె తెలిపారు , ఈ పరీక్ష కేంద్రాలను ఎంఈఓ తో పాటు తాసిల్దార్ సరస్వతి, పర్యవేక్షించడం జరిగింది. అలాగే పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ పురుషోత్తమ రాజు తన సిబ్బందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.