ఆదరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
1 min read
ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు
చెన్నూరు, న్యూస్ నేడు: మండలములోని ఆదరణ(పనిముట్లకు) సంబంధించి కులవృత్తుల వారికి,కళాకారులకు, ఆదరణ పథకం కింద ప్రభుత్వం పనిముట్లను అందజేయడం జరుగుతుందని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాకారులకు, కులవృత్తులకు పనిముట్లు అందచేయుటకు గాను, “కులసంఘాలు కళాకారులతో గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు చెన్నూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కులవృత్తులు, కళాకారులు, కుల సంఘాలు హాజరై ఈ ఆదరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు.