ఉభయగోదావరి జిల్లా వ్యాప్తంగా (ఆర్ అండ్ బి) కాంట్రాక్టర్ల ధర్నా
1 min read
ఆరుసంవత్సరాలుగా బిల్లులు చెల్లింపులలో ప్రభుత్వం జాప్యం
ఆర్థిక ఇబ్బందులు తాళ్లలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్న కాంట్రాక్టర్లు
జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేత
ఏలూరుజిల్లా న్యూస్ నేడు ప్రతినిధి: ఉభయగోదావరి జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈరోజు ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆరు సంవత్సరాలుగా బిల్లుల చెల్లింపులు జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి సమయంలో ఆర్ అండ్ బి రోడ్లు పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలిపారు. పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులకు కాంట్రాక్టర్లు వినతిపత్రం సమర్పించారు.